Homeహైదరాబాద్latest NewsChandraBabu Naidu : ఎన్నికలయ్యాక YCP ఖాళీ

ChandraBabu Naidu : ఎన్నికలయ్యాక YCP ఖాళీ

– జగన్​ చెప్పేవి నీతులు .. చేసేవి సైకో పనులు
– రాష్ట్రంలో ఆకుకూరలు దొరకడం లేదు కానీ..గంజాయి దొరుకుతోంది
– వైసీపీని గడ్డె దించేందుకు జనం రెడీ
– ఉద్యోగాల భర్తీపై ఎప్పుడైనా శ్రద్ధ పెట్టారా?
– టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

ఇదేనిజం, ఏపీ బ్యూరో: ఎన్నికలయ్యాక ఏపీలో వైసీపీ ఖాళీ అవుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్​ చెప్పేవి నీతులు.. చేసేవి సైకో పనులని హెచ్చరించారు. రాష్ట్రంలో ఆకుకూరలు దొరకడం లేదు కానీ.. గంజాయి దొరుకుతోందని చెప్పారు. సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన ‘రా. కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఫైర్​ అయ్యారు. ‘నడిరోడ్డుపై మహిళలను ఆ పార్టీ నేతలు వేధిస్తున్నారు. వారి జోలికి వస్తే వైసీపీకి అదే చివరి రోజవుతుంది. ప్రజల కోసం వారి మాటలు భరిస్తున్నాం. మాచర్లలో దుర్గారావు అనే కార్యకర్తను పోలీసులు వేధించారు. ఉన్మాది పాలనలో అందరం బాధితులమే’ అని చంద్రబాబు అన్నారు. వైసీపీని గద్దె దించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ ఐదేళ్లలో ఉద్యోగ ఖాళీల భర్తీపై ఏనాడూ శ్రద్ధ పెట్టలేదని విమర్శించారు. ‘‘ఉద్యోగం అడిగితే గంజాయి ఇస్తున్నారు. ఆకు కూరలు దొరకడం లేదు గానీ, రాష్ట్రమంతా గంజాయి దొరుకుతోంది. దానికి బానిసల్ని చేసి యువత భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారు. సంస్కరణలకు నాందిపలికిన పార్టీ టీడీపీ, ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు ఇచ్చాం. వైసీపీ ప్రభుత్వంలో 9 సార్లు ఛార్జీలు పెంచారు. పన్నుల బాదుడుతో పేదల రక్తాన్ని తాగుతున్నారని విమర్శించారు. జగన్‌ చెప్పేవన్నీ నీతులు. చేసేవన్నీ సైకో పనులు. దళితులెవరూ నోరెత్తకూడదు. ప్రశ్నించకూడదు. వారు స్వరం వినిపిస్తే గొంతు నొక్కేస్తారు, చంపేస్తారు. నాలుగున్నరేళ్లలో 6వేల దాడులు చేశారు. 188 మందిని పొట్టన పెట్టుకున్నారు. మాస్క్‌ అడిగిన సుధాకర్‌ను పిచ్చోణ్ని చేసి చంపారు. బాబాయిని చంపిన అవినాష్‌ రెడ్డి మాత్రం రోడ్డుపై తిరుగుతున్నారు. కోడికత్తి శ్రీను ఐదేళ్ల నుంచి జైలులో ఉన్నారు. సామాజిక న్యాయమంటే ఇదేనా’’ అని చంద్రబాబు మండిపడ్డారు. ఆ పార్టీని భూస్థాపితం చేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

Recent

- Advertisment -spot_img