Homeహైదరాబాద్latest Newsఈ బ్యాటరీ ఒక్కసారి చార్జ్​ చేస్తే 50 ఏండ్లు వాడుకోవచ్చు

ఈ బ్యాటరీ ఒక్కసారి చార్జ్​ చేస్తే 50 ఏండ్లు వాడుకోవచ్చు

చైనా ఇప్పుడు ప్రత్యేక రకం బ్యాటరీని సిద్ధం చేసింది. దీనిని ఛార్జింగ్ లేకుండా 50 ఏళ్లు వాడుకోవచ్చు. బ్యాటరీని తయారు చేసే చైనీస్ స్టార్టప్ కంపెనీ బీటావోల్ట్.. ఇది చాలా భిన్నమైనదని చెప్పింది. దీనికి స్థిరమైన ఛార్జింగ్ లేదా నిర్వహణ అవసరం లేదు అని ధృవీకరించింది. ఈ బ్యాటరీ అణుశక్తితో పనిచేస్తుంది. డ్రోన్లు – ఫోన్‌లతో సహా అనేక రకాల పరికరాల కోసం దీనిని ఉపయోగించవచ్చు. ఈ బ్యాటరీ వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద పరీక్షించారు. అందువల్ల ఒత్తిడిలో మంటలు లేదా పేలడం జరగదని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఈ బ్యాటరీ, పైలట్ పరీక్ష దశలో ఉంది. ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం, ఈ బ్యాటరీ ఐసోటోపులనుంచి విడుదలయ్యే శక్తిని విద్యుత్తుగా మార్చుకుని పనిచేస్తుంది. ఈ ప్రక్రియ మొదట 20వ శతాబ్దంలో అభివృద్ధి చేశారు. సోవియట్ యూనియన్ – అమెరికా శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ విధానాన్ని తీసుకువచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు చైనా 14వ పంచవర్ష ప్రణాళికను 2021 లో ప్రారంభించింది. ఈ కొత్త బ్యాటరీ ఇప్పుడు అదే ప్లాన్‌లో భాగం. చైనా, అమెరికా, యూరప్ మాత్రమే కాకుండా కొన్ని ఇతర దేశాలు కూడా ఈ టెక్నాలజీపై కూడా కృషి చేస్తున్నారు. అయితే ఇందులో చైనా ముందంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ న్యూక్లియర్ ఎనర్జీ బ్యాటరీ అనేక రంగాల్లో విప్లవాన్ని తీసుకురాగలదని చైనా కంపెనీ బీటావోల్ట్ చెబుతోంది. వాటిని ఏరోస్పేస్, AI పరికరాలు, వైద్య పరికరాలు, హైటెక్ సెన్సార్లు, చిన్న డ్రోన్‌లు, మైక్రోప్రాసెసర్‌లు మరియు మైక్రోబోట్‌లలో కూడా ఉపయోగించవచ్చు. కొత్త బ్యాటరీ ప్రత్యేకించి AI ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. విశేషమేమిటంటే -60C నుంచి 120 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలలో ఈ బ్యాటరీ పని చేయగలదు. 100 మైక్రోవాట్ల శక్తిని ఉత్పత్తి చేసే తొలి అణు బ్యాటరీ ఇదేనని బీటావోల్ట్ చెబుతోంది. ఇది కాకుండా ఇది 3 వోల్టేజ్ విద్యుత్‌ను అందిస్తుంది. అయితే, 2025 నాటికి దీన్ని 1 వాట్ పవర్‌కి తీసుకెళ్లాలని కంపెనీ యోచిస్తోంది. దీని పరిమాణం ప్రస్తుతం
రూపాయి నాణెం పరిమాణంలో ఉంది. దీనిని మొబైల్ నుంచి డ్రోన్ వరకు ప్రతిదానిలో ఉపయోగించవచ్చు.

Recent

- Advertisment -spot_img