ఇటీవలే వన్డే, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్.. ఇప్పుడు టీ20 క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ఇస్తున్నట్లు తెలిపాడు. వచ్చే టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తానని డేవిడ్ వార్నర్ తెలిపాడు. దీంతో వార్నర్ అంతర్జాతీయ కెరీర్ 2024లో ముగియడం కన్ఫామ్ అయింది. ఆస్ట్రేలియా తరపున 100వ టీ20 మ్యాచ్ ఆడిన అనంతరం డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ.. వెస్టిండీస్‌తో జరిగిన ఈ ప్రదర్శన తనకెంతో సంతోషంగా ఉందన్నారు. నా ముందు కేవలం ఒక నెల మాత్రమే ఉంది. కాబట్టి నేను ఈ ఫాంను కొనసాగించాలనుకుంటున్నాను. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాను అని వార్నర్ తెలిపాడు.