డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇవాళ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రైతులు, కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా ఆయన రైతు రుణమాఫీపై గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని.. రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని.. దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పంటకు మద్దతు ధర కూడా అందిస్తామని స్పష్టం చేశారు.