Homeహైదరాబాద్latest Newsగిట్టుబాటు ధర కల్పిస్తాం ఆందోళన చెందవద్దు

గిట్టుబాటు ధర కల్పిస్తాం ఆందోళన చెందవద్దు

ఇదే నిజం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మార్కెట్ యార్డ్‌లో ఆందోళన వ్యక్తం చేస్తున్న వేరుశెనగ రైతులను గురువారం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కలిశారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఔటాన్ ప్రకారం వేరుశనగ పంటకు ధర చెల్లించాలని సంబంధిత అధికారులకు, వ్యాపారస్తులకు సూచించారు. శుక్రవారం నుంచి రైతులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులకు ఉన్న సమస్యలన్నింటికీ పరిష్కరించడానికి కృషి చేస్తామని, రైతులు అందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img