ఇదే నిజం గుమ్మడిదల : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో గుమ్మడిదల మండల పరిధిలోని అన్నారం ఎంపీటీసీ -1 లక్ష్మీ, వారి కుమారుడు బాలకిషన్, నాయకులు మెడిపల్లి పాపయ్య, బేగరి యాదగిరి, డప్పు శ్రీనివాస్ గురువారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.