Homeహైదరాబాద్latest Newsఅభివృద్ధి పనులకు భూమిపూజ

అభివృద్ధి పనులకు భూమిపూజ

ఇదే నిజం, తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోలంపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు అధికారులు, గ్రామ ప్రజా ప్రతినిధులు శనివారం భూమిపూజ చేశారు. పోశమ్మ గుడి, స్ట్రీట్ లైట్స్ తో పాటు గౌడసంఘ కమిటీ హాల్ పనులను ప్రారంభించారు. కాగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీడీఓ విజయ్ కుమార్, ఎంపీఓ కిరణ్ కుమార్, ఎంపీటీసీ సభ్యుడు బండారి రమేశ్, పంచాయతీ సెక్రెటరీ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుడిగె కొండయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు గుంటి మల్లేశం కనుకం కొమురయ్య, సీపీఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి, నాయకులు కనకం మొండయ్య, బుడిగె సంపత్, రెడ్డి రవి, పడాల సారయ్య, పడాల శ్రీనివాస్, బుడిగె మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img