కండీషనర్.. హెయిర్ కేర్ రొటీన్లో కచ్చితంగా ఉండాల్సిన ప్రాడెక్ట్. ఇది జుట్టును ఆరోగ్యంగా, సిల్కీగా, సులభంగా మెయింటేన్ చేయడానికి కీలక పాత్రపోషిస్తుంది. షాంపూ తలను శుభ్రపరుస్తుంది. మురికి, నూనె, వ్యర్థాలను తొలగిస్తుంది. కండీషనర్ జుట్టకు తేమను తిరిగి అందించడానికి, కేశాలకు పోషణ అందించడానికి, మృదువుగా ఉంచడానికి సహాయపడుతుంది. షాంపూ చేయడం వల్ల జుట్టులోని సహజ నూనెలు తొలగిపోతాయి. జుట్టు పొడిగా, పెళుసుగా మారుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే.. జుట్టు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. కండీషనర్ జుట్టులోని తేమను తిరిగి నింపడానికి సహాయపడుతుంది. హెయిర్ షాఫ్ట్ను హైడ్రేట్ చేసి, తేమతో తిరిగి సీలింగ్ చేసి.. జుట్టును మృదువుగా, పట్టులా ఉంచుతుంది. కండీషన్ర్ రెగ్యులర్గా వాడితే.. జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు దెబ్బతినడాన్ని, చిట్లిపోవడాన్ని నివారిస్తుంది.