Homeహైదరాబాద్latest Newsఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా? .. అయితే డేంజర్​లో పడ్డట్టే..

ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా? .. అయితే డేంజర్​లో పడ్డట్టే..

ఎండాకాలం వచ్చిందంటే చాలు ఫ్రిజ్‌లో వాటర్‌ బాటిల్స్‌తో నింపేస్తారు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు మాటిమాటికి చల్లటి నీరు తాగి గొంతును తడుపుకుంటుంటారు. చల్లటి నీళ్లు తాగడం వల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది కానీ.. దీర్ఘకాలికంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆహారం తిన్న వెంటనే చల్లటి నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల జీవక్రియపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. తద్వారా రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. చల్లటి నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ట్రిక్‌ సమస్యలు కూడా వస్తాయి. చల్లటి నీళ్లు గుండెలోని వాగస్‌ నరాలపై ప్రభావం చూపిస్తుంది. దీని ద్వారా గుండె పనితీరు నెమ్మదిస్తుంది.. హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. ఫలితంగా గుండెపోటు వచ్చే ఛాన్స్‌ కూడా ఉంటుంది. అందుకే హృద్రోగులు చల్లటి నీళ్లకు దూరంగా ఉండటమే మంచిదని వైద్యులు సూచిస్తుంటారు.

Recent

- Advertisment -spot_img