Homeహైదరాబాద్latest Newsసాంకేతిక రంగాల్లో మహిళలు పోటీతత్వం పెంచుకోవాలి

సాంకేతిక రంగాల్లో మహిళలు పోటీతత్వం పెంచుకోవాలి

– ‘జ్యోతిష్మతి’ చైర్మన్ సాగర్ రావు..

ఇదే నిజం, తిమ్మాపూర్: సాంకేతిక రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా రాణించాలని జ్యోతిష్మతి అటానమస్ కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అకాడమీ ఆధ్వర్యంలో జ్యోతిష్మతి కళాశాలలో 21రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. మైక్రోసాఫ్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా దాదాపు 35 ప్రోగ్రామ్స్ పై విద్యార్థులకు శిక్షణ ఉంటుందని చెప్పారు. విద్య, నైపుణ్యం పెంచుకునే కార్యక్రమాలతో మహిళలకు సాధికారత కల్పించి, వారికి సర్టిఫికెట్లు అందజేస్తారని వివరించారు. అనంతరం ప్రిన్సిపాల్ డా. కే ఎస్ రావు మాట్లాడుతూ.. డేటా అనాలటిక్స్ ద్వారా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాల్లో అవసరమైన జ్ఞానం పెంచుకోడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మైక్రోసాఫ్ట్ శిక్షణ ధ్రువీకరణతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలను అందుకోవచ్చునని సూచించారు. విద్యార్థునిలు, మహిళా అధ్యాపకులతో కలిపి దాదాపు 115 మందికి శిక్షణనను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ సుమిత్ సాయి, ప్రిన్సిపాల్ డా. కేఎస్ రావు, అకాడమిక్ ఆడిట్ డీన్ డా. పీకే వైశాలి, స్టూడెంట్ అఫ్ఫైర్స్ డీన్ డా. సంపత్ రావు, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డా. ఆర్ జగదీష్, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థినిలు పాల్గొన్న

Recent

- Advertisment -spot_img