ఇదేనిజం, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజక వర్గంలోని వివేకానందనగర్, ఆల్విన్ కాలనీ డివిజన్ల పరిధిలోని పలు కాలనీల్లో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలపై శుక్రవారం స్థానిక శాసనసభ్యులు ఆరికెపూడి గాంధీ.. కూకట్ పల్లి ట్రాఫిక్ సీఐ శ్రీనివాసులు, ట్రాఫిక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివేకానందనగర్ కాలనీ, సప్తగిరికాలనీ, శుభోదయకాలనీ, నవోదయకాలనీ, భాష్యం స్కూల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికై చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రచించాలని, రద్దీ వలన ఉదయం, సాయంత్రం రహదారులు నిత్యం రద్దీగా మారి ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదురుకుంటున్నారన్నారు. ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉందని ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంజీవ రెడ్డి, కాలనీ వాసులు శర్మ, మల్లయ్య ,హర్ష ,రాజీ రెడ్డి, ప్రవీణ్, శివ శంకర్, మదన్, సత్యనారాయణ, అల్లురయ్య, స్వరూపనంద్, శ్యామ్ కుమార్, హేమ చందర్, వినోభా, ప్రభాకర్ పాల్గొన్నారు.