– భారతదేశం పట్ల అనుచితంగా మాట్లాడటంతో ఫిర్యాదు
ఇదేనిజం, శేరిలింగంపల్లి: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పీఎస్లో కేసు నమోదైంది. ఇటీవల మహిళల వస్త్రధారణ మీద సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీనికి కౌంటర్ గా చిన్మయి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతదేశాన్ని Stupid కంట్రీగా అభివర్ణించారు. ఈ దేశంలో పుట్టడం నా ఖర్మ అని చిన్మయి వ్యాఖ్యానించారు. దీంతో కుమారస్వామి అనే వ్యక్తి గచ్చిబౌలి పీఎస్ లో కేసు పెట్టారు. చిన్మయి అన్నపూర్ణమ్మకు ఏమైనా చెప్పాలనుకుంటే నేరుగా చెప్పాలి.. అంతేకాని దేశాన్ని అవమానించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. భారత దేశంలో పుట్టడమే ఖర్మ. భారతదేశం ఒక చెత్తదేశం అని అనటం బాధాకరమన్నారు. బాధ్యతగల పౌరుడిగా తాను పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిపారు.