Homeహైదరాబాద్latest NewsLasya Nandita యాక్సిడెంట్ కేసులో టిప్పర్​ సీజ్​ : Hyderabad

Lasya Nandita యాక్సిడెంట్ కేసులో టిప్పర్​ సీజ్​ : Hyderabad

ఇదేనిజం, హైదరాబాద్​: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఓఆర్‌ఆర్‌పై జరిగిన ప్రమాదంలో టిప్పర్‌ను ఢీకొట్టడంతోనే లాస్య నందిత మృతిచెందారని గుర్తించారు. కారును ఢీకొన్న టిప్పర్‌ను పటాన్‌చెరు పోలీసులు గుర్తించారు. టిప్పర్‌ను సీజ్‌చేసిన పోలీసులు డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు. గతనెల 23న పటాన్‌చెరు పరిధిలోని ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలోని ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు.. గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి ఢీకొని అదుపు తప్పి రెయిలింగ్‌ను బలంగా ఢీకొంది.

Recent

- Advertisment -spot_img