క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించిన అందాల ముద్దుగుమ్మ దివి.. బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఒక్కసారిగా తెలుగు వారిని ఆకర్షించింది. హౌజ్‌లో తనదైన చలాకీ తనం, అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తెలుగువారందరికీ సుపరితురాలైంది. ఈ షోలోనే చిరంజీవి సినిమాలో నటించే లక్కీ ఛాన్స్‌ను కొట్టేసింది. చిరు హీరోగా ఇటీవల వచ్చిన ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో దివి నటించిన విషయం తెలిసిందే. ఇక సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ. ఎప్పటికప్పుడు సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను పంచుకునే ఈ బ్యూటీ. తన లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారు గుండెదడ పెంచేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు దివినుంచి భువికిదిగివచ్చిన దేవత అంటూ కామెంట్లు పెడుతున్నారు.