Homeహైదరాబాద్latest Newsగ్రూప్​ 1, 2, 3 పరీక్ష తేదీలు ఖరారు : Groups Notification

గ్రూప్​ 1, 2, 3 పరీక్ష తేదీలు ఖరారు : Groups Notification

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఎస్సీ గ్రూప్​ 1, 2, 3 పోస్టులను ఖరారు చేసింది. ఆగ‌స్టు 7, 8 తేదీల్లో గ్రూప్ -2 రాత‌ప‌రీక్ష‌ల‌ను , న‌వంబ‌ర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. అక్టోబ‌ర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీఎస్‌పీఎస్సీ స్ప‌ష్టం చేసింది. జూన్ 9వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే టీఎస్‌పీఎస్సీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. గ్రూప్​ 1లో 563 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 783 గ్రూప్‌- 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. 1,388 గ్రూప్‌ -3 ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్‌- 1 ఉద్యోగాలకు మార్చి 14వరకు దరఖాస్తులు స్వీకరణ కొనసాగనుండగా.. గ్రూప్‌ -2 ఉద్యోగాలకు 5.51లక్షల మంది, గ్రూప్‌ 3 పోస్టులకు సైతం 5లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img