– నాటి ఘటన కండ్ల ముందు కదలాడుతోంది
– నిర్బంధాలు.. అరెస్టులు.. దిగ్బంధాలు ఎదుర్కొన్నాం
– మిలియన్ మార్చ్ జరిగి 13 ఏండ్లు అయిన
– సందర్భంగా గుర్తు చేసుకున్న హరీశ్ రావు
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యమంలో భాగంగా జరిగిన మిలియన్ మార్చ్ ను మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తు చేసుకున్నారు. నాటి ఘటన ఇంకా కండ్ల ముందు కదలాడుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కీలక ఘట్టం మిలియన్ మార్చ్ అని హరీశ్ అన్నారు. ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన ప్రజా విప్లవమని చెప్పారు. నిర్బంధాలు.. అరెస్టులు.. దిగ్బంధాలను ఎదుర్కొంటూ జల మార్గం గుండా పడవలో వచ్చి మిలియన్ మార్చ్ లో పాల్గొన్న సందర్భం నేటికి 13 ఏండ్లయినా ఇంకా కళ్ళముందు కదలాడుతూనే ఉందంటూ నాటి ఘటనను గుర్తుచేసుకున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ఆ నాడు తెలంగాణ ప్రజలు చూపిన తెగువకు, పోరాటానికి, ఉద్యమ స్ఫూర్తికి వందనమని సామాజిక మాద్యమం ఎక్స్ వేదిగా పంచుకున్నారు.