Homeహైదరాబాద్latest NewsBRS కు మళ్లీ నాలుగు దెబ్బలు : Telangana Politics

BRS కు మళ్లీ నాలుగు దెబ్బలు : Telangana Politics

– బీజేపీలోకి మాజీ ఎంపీలు

– కాషాయపార్టీలో చేరిన సైదిరెడ్డి,జలగం వెంకట్రావు, సీతారాం నాయక్, నగేశ్

అందరికీ ఎంపీ టికెట్లు వచ్చే చాన్స్

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: BRS పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఆ పార్టీకి చెందిన నేతలు నిత్యం ఎవరూ ఒకరు పార్టీ వీడుతున్నారు. కొంతమంది BJP గూటికి, మరికొందరు కాంగ్రెస్ గూటికి వెళ్తున్నారు. తాజాగా మాజీ ఎంపీలు కొందరు నేతలు బీజేపీలో చేరిపోయారు. మాజీ ఎంపీలు సీతారాం నాయక్, నగేశ్, మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, శానంపూడి సైదిరెడ్డి కాషాయపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో వీరంతా బీజేపీ గూటికి చేరుకున్నారు. వీరందరికీ ఎంపీ టికెట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ టికెట్ నగేశ్ కు, మహబూబాబాద్ టికెట్ సీతారాం నాయక్ కు, నల్లగొండ టికెట్ శానంపూడి సైదిరెడ్డికి, ఖమ్మం టికెట్ జలగం వెంకట్రావుకు వచ్చే అవకాశం ఉంది. వీరంతా ఎంపీ టికెట్ హామీ మీదే పార్టీ మారుతున్నట్టు సమాచారం. ఆయా చోట్ల బీజేపీకి బలమైన అభ్యర్థులు కూడా లేరు. దీంతో వీరిని చేర్చుకొని బీజేపీ టికెట్ ఇవ్వబోతున్నది. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ నేతలు లక్ష్మణ్‌, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img