Homeహైదరాబాద్latest Newsముగ్గురు మాజీ సీఎంల కొడుకులకు MP Tickets టికెట్లు

ముగ్గురు మాజీ సీఎంల కొడుకులకు MP Tickets టికెట్లు

– కాంగ్రెస్​ రెండో జాబితా విడుదల
– 43 మందితో సెకండ్​ లిస్ట్​
– తెలంగాణ రాష్ట్రానికి నో చాన్స్​
– ప్రకటించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​

ఇదేనిజం, నేషనల్​ బ్యూరో: కాంగ్రెస్​ పార్టీ 43 మందితో ఎంపీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల కుమారులకు అవకాశం దక్కింది. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌నాథ్‌ కు ఛింద్వాడా టికెట్​, రాజస్థాన్‌ మాజీ సీఎం అశోక్‌ గహ్లోత్‌ కుమారుడు వైభవ్‌ గహ్లోత్‌ను జాలోర్‌ టికెట్​, అసోం మాజీ సీఎం తరుణ్‌ గగోయ్‌ కొడుకు జోర్హాట్‌ టికెట్​ దక్కనున్నది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లిస్ట్​ ను ప్రకటించారు. 43 మందిలో జనరల్‌ కేటగిరీకి చెందినవారు 10 మంది కాగా.. 13 మంది ఓబీసీలు, 10 మంది ఎస్సీ, 9 మంది ఎస్టీ, ఒకరు ముస్లిం మైనారిటీకి చెందినవారని కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img