Homeహైదరాబాద్latest Newsకుష్టు వ్యాధిపై ఇంటింటి సర్వే..

కుష్టు వ్యాధిపై ఇంటింటి సర్వే..

ఇదేనిజం, నెల్లికుదురు : మండల వైద్యాధికారి వంశీకృష్ణ ఆధ్వర్యంలో జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ వణాకర్​రెడ్డి బుధవారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో సందర్శించారు. ఆయన క్షేత్రస్థాయిలో వ్యక్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీఎంవో మాట్లాడుతూ 2027 నాటికి కుష్టు రహిత సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వ ప్రణాళికకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్పర్శలేని మచ్చలున్నట్లయితే వెంటనే స్థానిక పీహెచ్సీని సంప్రదించాలన్నారు. కుష్టు వ్యాధిని ప్రాథమిక దశలోగుర్తించి నట్లయితే అంగవైకల్యం రాకుండా కాపాడు కోవచ్చన్నారు. సర్వేకు సహకరించాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో సీహెచ్వో విజయ్​కుమార్, హెచ్ఈవో కారు పోతుల వెంకటేశ్వర్లు, ఆశావర్కర్లు స్వరూప, అరుణ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img