ఇదేనిజం, కోదాడ : రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణం కాపాడిన వారమవుతామని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. బుధవారం పట్టణంలోని 25 వార్డులో బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగ నాయకులు వేముల కోటేశ్వరరావు తన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ముఖ్యతిథిగా హాజరై మాట్లాడుతూ యువకులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. యువత సమాజం పట్ల సేవాభావనాతో ఉండటం మంచి విషయమని, ఒకరు ఇచ్చే రక్తం మరొకరి ప్రాణం నిలుపుతుందన్నారు. కార్యక్రమంలో 25 వార్డు ఇన్చార్జి చింతల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అల్వాల వెంకటేశ్వర్లు, చింతల లింగయ్య, కోదాటి కృష్ణయ్య, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.