Homeహైదరాబాద్latest Newsచేవెళ్ల BRS అభ్యర్థిగా Kasani Gnaneshwar

చేవెళ్ల BRS అభ్యర్థిగా Kasani Gnaneshwar

– వరంగల్ నుంచి పోటీ చేయనున్న కడియం కూతురు కావ్య
– ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఖరారు చేసిన అధిష్టానం

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నిలకు బీఆర్ఎస్ మరో ఇద్దరు అభ్యర్థులను బుధవారం ప్రకటించింది. వరంగల్‌ నుంచి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్‌ కావ్య, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌ పేర్లను ఖరారు చేసింది. మొదటి జాబితాలో కరీంనగర్‌ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్‌కుమార్‌ అవకాశాన్ని దక్కించుకోగా.. పెద్దపల్లి స్థానానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఎంపిక చేశారు. ఇప్పటికే కరీంనగర్‌ కదనభేరి సభతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img