Homeహైదరాబాద్latest NewsTollywood News : ‘పరదా’ అనుపమ సరదా

Tollywood News : ‘పరదా’ అనుపమ సరదా

‘సినిమా బండి’ డైరెక్టర్‌ ప్రవీణ్ కాండ్రేగులతో అనుపమ పరమేశ్వరన్ ఓ సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. అయితే ఈ సినిమాకి ‘పరదా’ అనే టైటిల్‌ పెట్టినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఆనంద మీడియా బ్యానర్‌పై విజయ్ డొంకాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమతో పాటు సంగీత, దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్ వంటి నటీనటులు యాక్ట్ చేశారు.ఇక అనుపమ-సిద్ధు జొన్నలగడ్డ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘టిల్లు స్క్వేర్’ మార్చి 29న రిలీజ్ కాబోతుంది. డీజే టిల్లు సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img