– కష్ట కాలంలో కలిసి ఉన్నోళ్లకే ఫ్యూచర్
– బీఆర్ఎస్ కు మళ్లీ అధికారం వస్తుంది
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కీలక పదవి ఇస్తాం
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
ఇదే నిజం, మెదక్ ప్రధాన ప్రతినిధి: రానున్న రోజుల్లో భవిష్యత్తు అంతా గులాబీ పార్టీదేనని బీఆర్ఎస్ అధినేత , మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. అధికార పోయిందని ఎవరూ అధైర్య పడవద్దని పార్టీ శ్రేణులకు ఆయన భరోసా ఇచ్చారు. కష్ట కాలంలో పార్టీని పట్టుకుని ఉన్నవారికే భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసంలో సోమవారం రాత్రి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవల ఆయన బీఎస్పీని వీడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్.. ఆర్ఎస్ పీకి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసిఆర్. బీఆర్ఎస్ కు ఆటు పొట్లు కొత్త కాదన్నారు. సునామీ సృష్టించడం కూడా కొత్తకాదన్నారు. అధికారం పోగానే పార్టీలు మారడం మంచిది కాదన్నారు. గెలుపు , ఓటములు బీఆర్ఎస్ కు కొత్త కాదన్నారు. వంద సీట్లు గెలిచి బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని కేసిఆర్ జోస్యం చెప్పారు. బీఎస్పీని వదిలి బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ కు కీలక పదవిని గౌరవిoచుకుంటామన్నారు.