Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ఇన్​చార్జ్​ గవర్నర్​గా సీపీ రాధాకృష్ణన్

తెలంగాణ ఇన్​చార్జ్​ గవర్నర్​గా సీపీ రాధాకృష్ణన్

– ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఇన్​చార్జ్​ గవర్నర్​గా గా సీపీ రాధాకృష్ణన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం జార్ఖండ్​ గవర్నర్​ గా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్​ ట్విట్టర్​ వేదికగా స్పందించారు. ‘తెలంగాణ గవర్నర్, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు తనకు అప్పగించడాన్ని గౌరవంగా భావిస్తున్నా.. మాతృభూమికి సేవ చేయడానికి అవకాశం కల్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు. జై హింద్’ అంటూ కొత్త గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ట్వీట్ చేశారు.

Recent

- Advertisment -spot_img