Homeహైదరాబాద్latest Newsతాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి

– కలెక్టర్​ వీపీ గౌతమ్

ఇదేనిజం, ఖమ్మం : జిల్లాలో తాగునీటికి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్​లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎంపీడీవో, పీఆర్, ఆర్​డబ్ల్యూఎస్​ ఇంజినీర్లతో తాగునీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలాశయాల్లో నీటి లభ్యత తగ్గుతున్నందున రాబోయే రోజుల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో పట్టణ ప్రాంత పరిధిలో 804 బోర్లు, 151 పంప్​లు పనిచేస్తున్నట్లు, గ్రామీణ ప్రాంత పరిధిలో 1627 బోర్లు, 7199 పంప్​లు అందుబాటులో ఉన్నాయన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ముందు ముందు ఏఏ ప్రాంతాల్లో ఎంత మేర నీటి లభ్యత ఉంటుందో, ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ చేయాలన్నారు. బోర్ల మరమ్మతులు, ఫ్లషింగ్​లు చేయాలని, ప్రైవేటు బావులు, నీటి వనరులు లీజుకు తీసుకోనుట చేయాలన్నారు. నీటి వనరులు ఉన్న గ్రామాల్లో సరిపోను ఉన్నది లేనిది చూడాలన్నారు. తాగునీటి సరఫరా విషయమై మంజూరు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. బోర్ వెల్ ఆపరేటర్లు అనుమతి లేకుండా ప్రైవేట్​ బోర్లు వేస్తే వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ ఏఈలు క్షేత్ర స్థాయిలో గ్రామాలు తిరిగి తాగునీటి సరఫరాలో ఉత్పన్నమయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి సరిచేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, మధుసూదన్​నాయక్, ఖమ్మం కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, మిషన్ భగీరథ ఎస్ఈ సదాశివకుమార్, పీఆర్ ఎస్ఈ చంద్రమౌళి, జెడ్పీ సీఈవో వినోద్, డీపీవో హరికిషన్, సీపీవో శ్రీనివాస్, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, మిషన్ భగీరథ ఈఈలు పుష్పలత, వాణిశ్రీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img