Homeహైదరాబాద్latest Newsట్రెండింగ్​లో ‘ఉస్తాద్’ ఫస్ట్ గ్లింప్స్

ట్రెండింగ్​లో ‘ఉస్తాద్’ ఫస్ట్ గ్లింప్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీశ్​ శంకర్ కాంబోలో వస్తోన్న ‘ఉస్తాద్.. భగత్ సింగ్’మూవీ ఫస్ట్ గ్లింప్స్ యూట్యూబ్​ను షేక్​ చేస్తోంది. ఫస్ట్ గ్లింప్స్ రిలీజైన 24 గంటల్లోనే 3 మిలియన్లకు పైగా వ్యూస్​ సాధించింది. మంగళవారం ‘భగత్స్‌ బ్లేజ్‌’ పేరుతో ఓ వీడియో గ్లింప్స్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. నిమిషం నిడివితో ఉన్న ఈ వీడియోలో పవన్‌ ఫుల్ యాక్షన్‌ మోడ్‌లోనే కనిపించారు. వందలాది మంది జనం మధ్య నుంచి కారులో ఆయన ఎంట్రీ ఇచ్చిన తీరు.. జాతర మధ్యలో ఫైట్ సీన్లు ఆయన ఫ్యాన్స్​ మంచి ట్రీట్​ను ఇచ్చాయనే చెప్పాలి. ‘గాజు పగిలే కొద్దీ పదునెక్కిద్ది’,‘గ్లాస్‌ అంటే సైజ్‌ కాదు.. సైన్యం’అంటూ అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ హైలెట్​గా నిలిచాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. శ్రీలీల హీరోయిన్​గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Recent

- Advertisment -spot_img