ఇదే నిజం, కొమురం భీం ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ సిబ్బందికి డీఎం విశ్వనాథ్ నిమ్మరసం పంపిణీ చేశారు. వేసవిలో ఉద్యోగులు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు నిమ్మరసం ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం వేసవి ముగిసేవరకు కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సరయు, భారతి, ఉద్యోగులు పాల్గొన్నారు.