Homeహైదరాబాద్latest Newsవిచారణకు ఓకే : Supreme Court

విచారణకు ఓకే : Supreme Court


దిల్లీ: దిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal) పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈడీ(ED) అరెస్ట్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్​ సింఘ్వి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. జస్టిస్​ సంజీవ్​ ఖన్నా నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల ప్రత్యేక ధర్మాసం ఈ కేసును విచారించనుంది. ఈ కేసును అర్జెంటుగా విచారణకు స్వీకరించాల్సిందిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు సింఘ్వి ప్రస్తావించారు.

మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్య నిపుణుల బృందం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయానికి చేరుకుంది. కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అరెస్టు దృష్ట్యా ఐటీవో వద్ద భారీ ఎత్తున భద్రతాబలగాలు మోహరించాయి. రహదారులపై ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశాయి. పోలీసుల సూచనల ప్రకారం ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఐటీవో మెట్రో స్టేషన్‌ను మూసివేయనున్నట్లు దిల్లీ మెట్రో ప్రకటించింది. కేజ్రీవాల్‌ అక్రమ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని ఆమ్‌ఆద్మీపార్టీ పిలుపునిచ్చింది.

Recent

- Advertisment -spot_img