ఇదేనిజం, బాన్సువాడ: రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ గా నియామకమైన కాసుల బాలరాజ్ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి హైదరాబాద్ లోని రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి చైర్మన్ పదవి అప్పగించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం, మంత్రుల సహకారంతో కార్పొరేషన్ అభివృద్ధి కి, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కి కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డీసీసీ డెలిగేట్ కొట్టం మనోహర్, కాంగ్రెస్ నాయకులు బోడ భాస్కర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.