Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్‌లో చేరనున్న కేకే

కాంగ్రెస్‌లో చేరనున్న కేకే

హైదరాబాద్ : బీఆర్​ఎస్​ నేత, రాజ్యసభ్య సభ్యుడు కె.కేశవరావును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్‌ మున్షీ కలిశారు. బంజారాహిల్స్‌లోని కేకే నివాసానికి ఆమెతో పాటు ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్‌ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డి వెళ్లారు. ఈ భేటీలో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు సాగుతున్న సమయంలో కేకేను కాంగ్రెస్‌ నేతలు కలవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Recent

- Advertisment -spot_img