Homeహైదరాబాద్latest Newsఈరోజు హైదరాబాద్‌లో Earth Hour

ఈరోజు హైదరాబాద్‌లో Earth Hour

ఇదేనిజం, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌ ఈ రోజు రాత్రి గంటపాటు చీకటిమయం అవనుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ (World Wide Fund for Nature ) గంట పాటు విద్యుత్‌ను వాడకుండా ఉండాలని పిలుపునిచ్చింది. రాత్రి 8 : 30 నుంచి 9 : 30 గంటల ఎర్త్ అవర్‌ పాటించాలని సూచించింది. సచివాలయం, అంబేద్కర్‌ విగ్రహం పరిసరాలు, బుద్ధ విగ్రహం, దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జీ, చార్మినార్‌, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు అపార్ట్‌మెంట్లు, కమ్యూనిటీల్లోనూ గంటసేపు కరెంట్ వాడకుండా ఉండేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు.

థర్మల్‌ ప్లాంట్ల విద్యుదుత్ ఉత్పత్తి కారణంగా కాలుష్య ఉద్గారాలు పెద్దఎత్తున వాతావరణంలో కలుస్తున్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) ఏటా మార్చిలో ఎర్త్‌అవర్‌ (EARTH HOUR in Worldwide) నిర్వహిస్తోంది.

Recent

- Advertisment -spot_img