ఇదే నిజం, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది . మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమరి సూరిబాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా గడ్డం వంశీని ప్రకటిచడం హర్షనీయమన్నారు. అధికారం కోసం బీజీపీ ఎంతకైనా తెగిస్తుందన్నారు. మతం పేరుతో రెచ్చగొడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరిస్వామి, జిల్లా సెక్రెటరీ గెల్లి జయరాం రొడ్డ శ్యామ్, మత్తమారి జగన్ అన్వర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.