IPL: ఐపీఎల్లో Gujarat Titans బోణీ కొట్టింది. ఉత్కంఠ పోరులో Mumbai Indiansపై గుజరాత్ విజయం సాధించింది. టైటాన్స్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యానికి 8 పరుగుల దూరంలో ముంబయి నిలిచిపోయింది. ఓ దశలో 12 ఓవర్లలో 107/2 స్కోరుతో ముంబయికి విజయావకాశాలు మెండుగా ఉన్నా.. డెత్ ఓవర్లలో జీటీ పొదుపుగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది.