ఇవాళ ఉదయం సాంకేతిక లోపంతో హైదరాబాద్ మెట్రో రైలు సేవలు 10.40 నుంచి దాదాపు 25 నిమిషాల పాటు ఆగిపోయాయి. దీంతో జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర దాదాపు 15 నిమిషాల పాటు రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నాగోల్ టు మియాపూర్ మెట్రో రూట్ లో మెట్రో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 15 నిమిషాల తర్వాత తిరిగి మెట్రో రైలు ప్రారంభమైంది.
అయితే, హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను తప్పించుకునేందుకు చాలా మంది టైం సేఫ్ కోసం.. తొందరగా వెళ్లేందుకు చాలా మంది మెట్రో రైళ్లులో వెళ్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పనులు చేసే వాళ్లు చాలా మంది మెట్రోలోనే ప్రయాణం చేస్తుంటారు. అయితే, అపుడపుడు సాంకేతిక లోపంతో మెట్రో రైళ్లు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.