ఛత్తీస్గఢ్ బీజాపుర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు నక్సల్స్ మరణించారు. చికుర్బత్తి – పుస్బాక సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్(DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) కోబ్రా దళానికి చెందిన సిబ్బంది కలిసి యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే భద్రతా సిబ్బందిపై నక్సల్స్ కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు.
‘కాల్పులు జరిగిన తరవాత ఘటనా స్థలం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలను కూడా తీసున్నాం. కాల్పుల్లో పలువురు నక్సలైట్లు గాయపడ్డారు. ఇంకా బీజాపుర్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి’ అని సుందర్ రాజ్ వెల్లడించారు.