వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పెట్టిన పథకాలు అన్నీ జగన్ తీసేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆడపడచులకు అన్ని రకాలుగా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతులకు సబ్సిడీలు అందట్లేదని ఆరోపించారు.