లిక్కర్ స్కామ్ పేరిట 250 సార్లు ఈడీ సోదాలు జరిపిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ అన్నారు. తాగునీటి సమస్యలపై సంబంధిత మంత్రికి సీఎం కేజ్రీవాల్ లేఖ రాస్తే దానిపై కేసులు వేశారని ప్రెస్ మీట్ లో సునీతా కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన విషయాలు వెల్లడించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా బాధపడుతున్నారన్నారు. ఇప్పటి వరకు ఈడీ 250 సోదాలు జరిపిందని తెలిపారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపు అన్ని విషయాలు బయటపెడతారని స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్ డబ్బు ఎక్కడ ఉందో కూడా చెబుతారని ఆమె అన్నారు. వాటికి సంబంధించి కేజ్రీవాల్ ఆధారాలు కూడా సమర్పిస్తారని ఆమె స్పష్టం చేశారు.