ఇదే నిజం, కోరుట్ల : కోరుట్ల పద్మశాలి సంఘ భవనంలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి అధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు. బీపీ, షుగర్, ఈసీజీ, 2డీ ఎకో వంటి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రావణ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కుంబాజి సాయితేజ, సిబ్బంది, పద్మశాలి సంఘం నాయకులు రుద్ర శ్రీనివాస్,ఎంబేరి నాగభూషణం, ఎక్కల్ దేవి నవీన్, ముల్క ప్రసాద్,గడ్డం మధు, కైరంకొండ రాజగంగాధర్, గుండేటి రాజశేఖర్, అందె రమేష్ తదితరులు పాల్గొన్నారు.