Homeహైదరాబాద్latest NewsElection King.. ఓడిన లెక్కజేయకుండా 238 సార్లు పోటీ

Election King.. ఓడిన లెక్కజేయకుండా 238 సార్లు పోటీ

ఎన్నికలు ఏవైనా ఆయన పోటీ చేస్తారు. ఎన్నిసార్లు ఒడినా లెక్కచేయకుండా ఎన్నికల్లో పోటీ చేస్తునే ఉంటారు. ఇప్పటివరకు రాష్ట్రపతి ఎన్నికల నుంచి లోకల్‌ ఎన్నికల వరకు బరిలో దిగుతూ వచ్చారు. దేశంలో ఎన్నికలు ఏవైనా ఆయన పోటీ చేస్తారు. ఎన్నిసార్లు ఒడినా లెక్కచేయకుండా ఎన్నికల్లో పోటీ చేస్తునే ఉంటారు. ఇప్పటివరకు రాష్ట్రపతి ఎన్నికల నుంచి లోకల్‌ ఎన్నికల వరకు బరిలో దిగుతూ వచ్చారు. పలు ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన 238 సార్లు ఓటమి పాలయ్యారు. అవన్నీ లెక్క​ చేయని.. 65 ఏళ్ల ఆ వ్యక్తి 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తూ వార్తల్లో నిలిచారు.

తమిళనాడుకు చెందిన టైర్లు రిపేర్‌ చేసే షాప్‌ ఓనర్‌ కే. పద్మరాజన్‌. ఆయన దక్షిణ తమినాడులోని మెట్టూరు పట్టణానికి చెందినవారు. అయితే ప్రతి ఎన్నికలో తాను పోటీ చేస్తున్నందుకు అందరూ నవ్వేవారని తెలిపారు. కానీ, ఓ సామాన్యుడు ఎన్నికల్లో భాగంకావటంపైనే తన దృష్టి ఉంటుందని అంటున్నారు. అయితే ఎన్నికల్లో పోటీచేసే అందరూ విజయాన్ని కాంక్షిస్తారు. కానీ, నేను అలా కాదు. నేను పోటీలో పాల్గొనటమే నా విజయంగా భావిస్తాను. నేను ఓడిపోతున్నాని తెలిసిన మరుక్షణం.. ఆ ఓటమి ఆనందంగా స్వాగతిస్తానని తెలిపారు.

స్థానికంగా ‘ఎలక్షన్‌ కింగ్‌’అని పిలువబడే పద్మరాజన్‌.. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పోటీ చేయటం గమనార్హం. 1988 నుంచి పలు ఎన్నికల్లో పోటీ చేస్తున్న పద్మరాజు.. అటల్ బిహారీ వాజపేయి, మన్మోహన్‌ సింగ్‌, నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీలపై పోటీ చేశారు. ఎన్నికల్లో విజయం ప్రాధాన్యం కాదని, ప్రత్యర్థి ఎవరు? అనేది తాను అస్సలు పట్టించుకోని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేస్తూ ఎన్నిసార్ల ఓడిపోవటానికైనా సిద్ధమని తెలిపారు.

Recent

- Advertisment -spot_img