ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల రాజకీయాలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. మూడు పార్టీల పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన కొందరు పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో ముమ్మిడివరం జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పితాని బాలకృష్ణకు ఈ సారి టికెట్ దక్కలేదు.
ఆ స్థానంలో టీడీపీకి చెందిన దాట్ల బుచ్చిబాబుని ప్రకటించారు. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న పితాని వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30న జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.