Homeహైదరాబాద్latest Newsఫోక్ సాంగ్‌ను రిలీజ్ చేసిన ఎమ్మెల్యే Balu Naik

ఫోక్ సాంగ్‌ను రిలీజ్ చేసిన ఎమ్మెల్యే Balu Naik

ఇదే నిజం, దేవరకొండ : దేవరకొండలో రింగుల జుట్టు సిన్నోడు అనే ప్రైవేట్ ఫోక్ సాంగ్ ను ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ విడుదల చేశారు. అనంతరం సాంగ్ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ చరిత్రను ఇనుమడింపజేసే ఇలాంటి పాటలు మరిన్ని రూపొందించాలని ఆకాంక్షించారు. యూనిట్ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్ ,PACS చైర్మన్లు డాక్టర్ వేనుధర్ రెడ్డి ,శ్రీశైలం యాదవ్ , యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు కిన్నెర హరిక్రిష్ణ , తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img