Homeహైదరాబాద్latest Newsవిషాదం.. కాళ్ల పారాణి ఆరకముందే తనువు చాలించిన నవ వధువు

విషాదం.. కాళ్ల పారాణి ఆరకముందే తనువు చాలించిన నవ వధువు

మన్యం జిల్లా, మక్కువ మండలం, దబ్బగడ్డ గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అఖిల(20)కు నిన్న రాత్రి 10 గంటలకు వివాహ‌మైంది. పెళ్లి క్రతువు ముగిశాక నీరసంగా ఉందని నిద్రలోకి జారుకుంది.
త‌ర్వాత బంధువులు పిలిచినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను పీహెచ్‌సీకి త‌ర‌లించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి సాలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే నవ వధువు మృతి చెందినట్లు నిర్ధారించారు.

Recent

- Advertisment -spot_img