ఇదే నిజం, మంచిర్యాల : మంచిరాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు హాజీపూర్ మండలంలో పర్యటించారు. పడతనపల్లి గ్రామంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో సిసి రోడ్లు, డ్రైనేజీ పనులను పర్యవేక్షించారు. గ్రామస్థులతో కాసేపు ముచ్చటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు