ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత మనీశ్ సిసోడియాకు మరోసారి కోర్టులో చుక్కెదురయింది. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న సిసోడియా కస్టడీ నేటితో ముగియడంతో ఆయనను కోర్టులో ఇవాళ హాజరుపర్చారు. ఈ నేపథ్యంలో ఆయన జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఏప్రిల్ 18 వరకు ఆయనకు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.