ఐపీఎల్17వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. శుక్రవారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. పవర్ ప్లేలో హైదరాబాద్‌ను కట్టడి చేయకపోవడమే తమ ఓటమికి కారణమని తెలిపారు.
‘ఈ పిచ్ చాలా స్లోగా ఉంది. హైదరాబాద్ బౌలర్లు పరిస్థితులను చక్కగా ఉపయోగించుకున్నారు. ఇది నల్లరేగడి పిచ్ కావడంతో నెమ్మదిగా ఉంటుందని ముందే అంచనా వేశాం. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ మరింత స్లో అయింది. మేము ఫీల్డింగ్‌లో తప్పిదాలు చేశాం. అయినా ప్రత్యర్థిని 19వ ఓవర్ వరకు తీసుకొచ్చాం’ అని రుతురాజ్ చెప్పారు.