కథ డిమాండ్ చేస్తే ముద్దు సీన్లలో నటించడం తప్పేం కాదని యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. ఆమె హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘టిల్లు స్క్వేర్’లో అనుపమ లిప్‌లాక్ సీన్లతో రెచ్చిపోయారు. దీనిపై అనుపమ తాజాగా స్పందిస్తూ.. ‘నటిగా నేనిప్పుడు పరిణితి చెందుతున్నాను. ఒకే తరహా పాత్రల్లో నటించడం బోర్. టిల్లు స్క్వేర్ మూవీలో ముద్దు సీన్లలో నటించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. మూవీ చూసి కామెంట్స్ చేయండి.’ అని మండిపడ్డారు.