ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో అనుష్క ‘ఘాటీ’ అనే లేడీ ఓరియెంటేడ్ మూవీ చేస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ వేగంగా సాగుతోంది. అనుష్క పాత్ర ఓ కంప్లీట్ లైఫ్ జర్నీ ఆధారంగా సాగుతుందని టాక్. ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల కోసం అనుష్క అరవై ఏళ్ల పెద్దావిడగా కనిపించబోతుందని సమాచారం. కొన్ని రోజులక్రితం విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్ సైతం ఆకట్టుకుంది.