ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతిచెందింది. ఈ ఘటన హైదరాబాద్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం రాఘాపూర్ వాసి శివకుమార్ షాపూర్ నగర్లో నివాసముంటున్నారు. ఆదివారం భార్యా భర్తలు భోజనం చేసి నిద్రపోయారు. ఈ క్రమంలో పాప ఆడుకుంటూ ఇంటి ముందున్న మూతలేని సంపులో పడిపోయింది. కొద్దిసేపటికే అత్త నీటి కోసం వెళ్లి చూడగా చిన్నారి మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదైంది.