Idenijam, Hyderabad : ఉగాది పండగ వేళ హైదరాబాద్ నగరవాసులకు గుడ్న్యూస్. మెట్రోలో ఆఫర్లను పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ పీక్ హవర్ ఆఫర్లను మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఇటీవలే మార్చి 31తో ఈ ఆఫర్లు ముగియగా మళ్లీ పునరుద్ధరించారు. దీంతో మెట్రోరైల్ ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.