Delhi Excise Policy Case Updates : కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ సందర్భంగా దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదని తేల్చి చెప్పింది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేవీ ఉండవని వ్యాఖ్యానించింది. విచారణ ఎలా సాగాలో కోర్టుకు తెలుసని, నిందితులు చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొంది. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదని వ్యక్తీకరించింది. చివరిసారి వాదనల్లో దిల్లీ సీఎంనే అరెస్టు చేస్తారా అని కోర్టులో కేజ్రీవాల్ తన వాదనలను సొంతంగా వినిపించిన విషయం తెలిసిందే.